"కౌసల్య.. సుప్రజా... రామ" ట్రైలర్ మీకోసం...
శ్రీకాంత్, శివాజీ, ఛార్మీ, గౌరీ ముంజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "కౌసల్య.. సుప్రజా... రామ". సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని డి. రామానాయుడు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో తెరకెక్కించేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే... "నీకే మనసిచ్చా" ఫేమ్ డైరక్టర్ సూర్యప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
పూర్తిగా కుటుంబకథా నేపథ్యంలో, వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం సమకూర్చుతున్నారు. ఎం.ఎం. శ్రీలేఖ అందించిన పాటలకు, రమణ సంగీతం చక్కగా అమరిందని యూనిట్ వర్గాలు తెలిపాయి.
ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇటీవలే "కౌసల్య... సుప్రజా... రామ" సినిమాకు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలోని కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.