1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"నిన్న నేడు రేపు"ను ట్రైలర్‌లో తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ రవికృష్ణ అక్షర తమన్నా నిన్న నేడు రేపు ఎస్పిఆర్ ఎంటర్టైన్మెంట్స్ హైదరాబాద్ నవాబ్స్ లక్ష్మీకాంత్ చెన్నా
రవికృష్ణ, అక్షర, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించి తెరకెక్కిన చిత్రం "నిన్న నేడు రేపు". ఎస్.పి.ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై "హైదరాబాద్ నవాబ్స్" ఫేం లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో నూకారపు సూర్యప్రకాశ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఇటవలే విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.

నేటి యువత మనస్తత్వాలు, వారిలోని సున్నిత భావోద్వేగాలకు అద్దం పట్టే విధంగా సినిమా ఉంటుందని, దర్శకుని స్టైలీష్ టేకింగ్ అందర్నీ ఆకట్టుకుందని, ఆర్. అనీల్ అందించిన సంగీతం అందర్నీ ఆకట్టుకుందని దర్శకుడు సూర్యప్రకాశ రావు వెల్లడించారు. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కథాపరంగా చెప్పాలంటే... మనిషికి కోటి ఆశలుంటాయి. అవి ఎప్పటికీ తీరవు. అలాంటి ఆశలతో కలలు గనే ఓ యువకుడి జీవితకథే "నిన్న నేడు రేపు" చిత్రం. ఒక నిరుద్యోగి పట్టణానికి వస్తే ఇక్కడి పరిస్థితులవల్ల ఎలా మార్పు చెందాడనే పాయింట్‌ను... కథను శైలిని రక్తి కట్టించడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు.

కష్టించి పనిచేసి జీవితంలో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో తనకంటే ఎక్కువున్న వారిని చూసి ఈర్ష్య పడకూడదనే సందేశాన్ని చివరిలో విజయ్ ( హీరో రవికృష్ణ) పాత్ర ద్వారా దర్శకుడు చెప్పిస్తాడు. నేటి యువతకు చక్కని సందేశం ఈ చిత్రం ద్వారా చూపించారు. యువతను లక్ష్యంగా చేసుకుని సందేశాత్మకంగా తెరకెక్కిన "నిన్న నేడు రేపు" సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ ద్వారా తిలకించండి.
About Writer
SELVI.M