రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన "ఫూంక్" సినిమా తెలుగు వెర్షన్ "రక్ష" పేరుతో తెరకెక్కిన విషయం తెలిసిందే. జగపతి బాబు, కళ్యాణి, రాజీవ్ కనకాల, సుబ్బరాజు, చంద్రశేఖర్, బేబీ నేహా తదితరులు ఈ సినిమాలో నటించారు.
యండమూరి తులసీ దళం ఆధారంగా రూపొందిన ఈ సినిమా గురించి చెప్పాలంటే... హీరో(జగపతిబాబు)ను ఓ లేడి బిజెనెస్ పార్టనర్ కాంట్రాక్టును సంపాదించి పెట్టడం ద్వారా అతన్ని మోసం చేస్తుంది. ఇది తెలుసుకున్న అతను ఆమెను అందరి ముందు అవమానిస్తాడు. అది తట్టుకోలేని ఆమె అతని కుటుంబాన్ని నాశనం చేయటానికి నిర్ణయించుకుంటుంది.
అందులో భాగంగానే అతని ముద్దుల కుమార్తెకు చేతబడి చేయిస్తుంది. ఆ చేతబడి చేయించే ప్రత్యర్ధి పాత్రలో సత్యకృష్ణన్ చక్కగా నటించింది. ఇంకా ఈ సినిమాలో జయసుధ పాత్ర ద్వారా దర్శకుడు చక్కని సందేశాన్ని చెప్పించారని యూనిట్ వెల్లడించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న"రక్ష" సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..