సూర్య, సమీరారెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "సూర్య సన్నాఫ్ కృష్ణన్". ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నైజాంలో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా సి.వి.ఆర్. మీడియా అధినేత శోభారాణి మాట్లాడుతూ... తమ బేనర్‌లో "దశావతారం" విడుదలై సక్సెస్ అయిందని, ప్రస్తుతం "సూర్య సన్నాఫ్ కృష్ణన్"ను రిలీజ్ చేస్తున్నామని, ఇటీవలే సోని మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించదన్నారు.
తండ్రీకొడుకులు, కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత అనురాగాలు ఎలా ఉంటాయో..? ఈ చిత్రం ద్వారా దర్శకుడు గౌతమ్ చక్కగాచూపించారని తెలిపారు. దీపావళి నాడు విడుదలవుతున్న ఈ చిత్రం సక్సెస్ సాధించాలని శోభారాణి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇకపోతే ఈ సినిమా విశేషమేమిటంటే...? సూర్య 17 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు రకరకాల షేడ్స్‌లో కన్పిస్తారు. ముఖ్యంగా యువకుడిగా నటించడానికి దాదాపు ఆరు నెలలు భోజనం లేకుండా కేవలం ఫ్రూట్స్‌నే తీసుకుంటూ బాడీని తీర్చిదిద్దుకున్నారట. ఈ సినిమాలోని కొన్ని మధురమైన సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూసి ఆనందించండి.