చిత్రం మూవీస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు తేజ రూపొందిస్తున్న కొత్త చిత్రం "కేక". ఈ సినిమాకు చక్రి సంగీతం సమకూర్చారు. పి.సి. శ్రీరామ్ కెమెరా పనితనం "కేక" సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల్లో టాక్. వెండితెరకు జయం", "చిత్రం" వంటి హిట్ చిత్రాలను అందించిన తేజ "కేక" చిత్రంతో మరో బంపర్ హిట్ సాధించేందుకు సిద్ధమౌతున్నట్లు సినీ వర్గాల సమాచారం.
ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన ఈ సినిమా ఆడియోకు శ్రోతలను మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తేజ మాట్లాడుతూ... చిత్రం మూవీస్ బేనర్‌లో సినిమా చేసి ఐదేళ్లయిందన్నారు. మొట్ట మొదటిసారిగా సంగీతదర్శకుడు చక్రితో కలిసి పనిచేశానని వెల్లడించారు.
అంతేకాకుండా 40 మంది ఆర్టిస్టులను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నామని తేజ తెలిపారు. అందులో నలుగురు హైదరాబాదీయులు, మిగిలిన వారు బెంగాలీయులు నటిస్తున్నారని అన్నారు. "కేక" వీధిబాలల స్టోరీ అని, వారి జీవనపోరాటం, ఆకలి, ప్రేమ, చీటింగ్, ఫైట్స్ ఇలా అన్నీ రకాల ఎమోషన్స్ కలిసిన కథ ఇదని, తెలుగు సినిమాలోనే కొత్త ఫార్మెట్‌లో ఈ చిత్రాన్ని తీశానని తేజ చెప్పారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్లో వీక్షించండి.