1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

సస్పెన్స్ థ్రిల్లర్ "మ్యావ్" ట్రైలర్‌ను వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ మ్యావ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ మ్యావ్ బాలాదిత్య మనిషి దేవుడు దెయ్యం
కొత్తనటీనటులతో "మ్యావ్" (బ కేర్‌ఫుల్) అనే పేరుతో ఏకరుద్రా దేవి ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోన్న చిత్రం "మ్యావ్". ప్రతి మనిషికి మరణం అనేది తప్పనిసరి అని, అలాంటి మరణం సహజంగా సంభవిస్తే బాగుంటుందని, అలా కాకుండా దారుణంగా చంపబడితే చరిత్రలో నిలిచిపోతుందని ఈ చిత్ర రచయిత బాలాదిత్య తెలిపారు.

మనిషి- దేవుడు- దెయ్యం మూడింటిని మిళితం చేస్తూ...సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు విద్య తీర్చిదిద్దారని బాలాదిత్య చెప్పారు. కామెడీ, రొమాన్స్, ట్విస్ట్‌లున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పారు. తొలిసారిగా తాను మాటల రచయితగా పరిచయమవుతున్నానని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... అంతా కొత్తవారైనప్పటికీ చిత్తశుద్ధితో అనుకున్నది అనుకున్నట్లు వచ్చేలా ఈ సినిమాను మలిచామని చెప్పారు. ఈ చిత్రం తమకు మంచి గుర్తింపు సంపాదించి పెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M