1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"మిస్ భారతి"ని ట్రైలర్‌లో వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ బెంగళూరు యధార్థ సంఘటన మిస్ భారతి ప్రతాని రామకృష్ణ సాఫ్ట్వేర్ నేపథ్యం
బెంగళూరులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం "మిస్ భారతి". ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని నిర్మాత ప్రతాని రామకృష్ణ అంటున్నారు. సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రాన్ని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా చూస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఈ చిత్రం గతవారంలో విడుదలైంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... కన్నడ నటుడు విష్ణు వర్ధన్ కుమారుడు వినయ్ వర్ధన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో నవ్యా నాయర్ టైటిల్ పాత్ర పోషించిందన్నారు. దర్శకుడు గణేషన్ టేకింగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని రామకృష్ణ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజభాస్కర్ చక్కని బాణీలు సమకూర్చారని నిర్మాత ఈ సందర్భంగా వెల్లడించారు.
About Writer
SELVI.M