"కొత్త బంగారు లోకం"ను ట్రైలర్‌లో తిలకించండి
దిల్రాజు నిర్మాణ సారథ్యంలో హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్ ప్రధాన పాత్ర పోషించి చిత్రం "కొత్త బంగారు లోకం". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
"కొత్త బంగారు లోకం" పాటలకు ఇప్పటికే శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాత వెల్లడించారు. అదే విధంగా సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను కొత్త బంగారు లోకం ఆకట్టుకుంటుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతి కుటుంబంలో జరిగే పలు అంశాల్లో ఒక ప్రత్యేక పాయింట్‌ను ఎంచుకుని ప్రధానాంశంగా చిత్రీకరిస్తున్నట్లు దిల్‌రాజు వెల్లడించారు. హీరో తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని, ఆర్య, బొమ్మరిల్లు, ఠాగూర్ లాంటి హిట్ చిత్రాలనందించిన శ్రీకాంత్ మరో హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకోనున్నారని దిల్ రాజు అన్నారు. హ్యాపీడేస్‌లో ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో ఈ కుటుంబ కథా చిత్రాన్ని చూస్తున్నంత సేపు అలాగే ఫీలవుతారని దిల్‌రాజు వివరించారు.
ఈ చిత్రంలో దాదాపుగా కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నామని, అలాగే హీరోయిన్‌గా శ్వేత ప్రసాద్ పరిచయం అవుతోందని తెలిపారు. "హరేరామ్"కు సంగీతం సమకూర్చిన మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ ద్వారా తిలకించండి.