1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"వినాయకుడు"ను ట్రైలర్‌లో వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ కృష్ణుడు సోనియా ప్రేమ్ మూవీస్ పతాకం వినాయకుడు సాయికిరణ్ సరితా పట్రా ప్రేమ్ కుమార్
కృష్ణుడు, సోనియా జంటగా ప్రేమ్ మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న చిత్రం "వినాయకుడు". సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సరితా పట్రా నిర్మిస్తున్నారు.

రొమాన్స్, కామెడీ అంశాలతో రూపుదిద్దుకుంటున్న వినాయకుడు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని సమర్పకుడు ప్రేమ్ కుమార్ తెలిపారు.

వినోదాన్ని పుష్కలంగా పండిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ ప్రసన్న సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా వినాయకుడు ఉంటాడని ప్రేమ్ కుమార్ చెప్పారు.

వినాయకచవితి రోజున మార్కెట్లోకి విడుదలైన ఈ సినిమా పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని ప్రేమ్ కుమార్ అన్నారు. ఈ సినిమాలోని కొన్ని మధురమైన సన్నివేశాలను ట్రైలర్‌ ద్వారా వీక్షించండి.
About Writer
SELVI.M