1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

విజయ్ "ఐపీఎస్" ట్రైలర్‌ను తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ సుమంత్ చాందిని  కె హనుమంతరెడ్డి విజయ్ ఐపిఎస్ నిర్మాత నట్టికుమార్ 31
సుమంత్, చాందిని హీరోహీరోయిన్లుగా కె. హనుమంతరెడ్డి దర్శకత్వంలో రూపొందించిన విజయ్ "ఐ.పి.ఎస్" చిత్రాన్ని ఈ నెల 31వతేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత నట్టికుమార్ వెల్లడించారు. సీనియర్ నిర్మాత జయకృష్ణ మొదలు పెట్టిన ఈ చిత్రాన్ని యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలిపారు. హీరో సుమంత్ కెరీర్‌కు ఈ సినిమా ఎంతగానో దోహదపడుతుందని నట్టికుమార్ పేర్కొన్నారు.

చిత్ర దర్శకుడు హనుమంతరెడ్డి వివరిస్తూ... ఇదొక సిన్సియర్ పోలీస్ అధికారి కథని, అందుకే "ట్రూ ఇండియన్" అనే ట్యాగ్‌లైన్ కూడా జోడించామన్నారు. దేశం ఇలాంటి దారుణ స్థితికి చేరుకోవడానికి రాజకీయ నాయకులే ప్రధాన కారణమని, నిజాయితీగల రాజకీయనాయకులూ లేకపోలేదని, అలాంటి వారు కనుమరుగవుతున్నారని హనుమంతరెడ్డి వెల్లడించారు.

ఇక హీరోయిన్ పాత్ర విషయానికొస్తే... హీరో నిజాయితీని చూసి ఆమె ప్రేమిస్తుంది. కానీ ఆ ప్రేమను అంగీకరించకుండానే, హీరో చెప్పిన మాటలు ఆమెలో మార్పును తీసుకొస్తాయని హనుమంత రెడ్డి తెలిపారు. మంచి కథతో రూపొందించిన ఈ చిత్రం సక్సెస్ అవుతుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా ఈ చిత్రానికి కెమెరా... ఎ.రాజా, సంగీతం... లలిత్ సురేష్, సహనిర్మాత.. వై.నరేందర్ రెడ్డి, కథ, మాటలు, స్కీన్‌ప్లే, దర్శకత్వం... కె.హనుమంత రెడ్డి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ ద్వారా వీక్షించండి.
About Writer
SELVI.M