"ఇంద్రాణి"ని ట్రైలర్‌లో వీక్షించండి
సంఘవి ప్రధాన పాత్రలో ప్రసన్నలక్ష్నీపిక్చర్స్ పతాకంపై తెరకెక్కనున్న చిత్రం "ఇంద్రాణి". ఎం.ఎ చౌదరి దర్శకత్వంలో గుడిపాటి నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్‌తో కూడిన తమ సినిమా "మంత్ర", "అనుసూయ" కంటే మంచి విజయాన్ని సాధిస్తుందని నిర్మాత నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రానికి రీ రికార్డింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత చెప్పారు. కథాపరంగా ఈ చిత్రాన్ని పాలకొల్లు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రించామని చెప్పారు. చిత్ర దర్శకుడు ఎం.ఎ. చౌదరి మాట్లాడుతూ...ఈ చిత్రానికి గోరంట్ల కృష్ణ సమకూర్చిన సంగీతం చక్కగా అమరిందని చెప్పారు.
ఇంకా... ఈ సినిమాలో కృష్ణభగవాన్, సుధాకర్, కాస్ట్యూమ్స్ కృష్ణ, రాజేష్, గుండు హనుమంతరావు, అల్లరి సుభాషిణి, మాధవన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు... త్యాగరాజు, పాటలు... రవీంద్రదేశాయ్, కెమెరా... శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్‌సమి, సమర్పణ... బేబి విన్య, నిర్మాణ సారథ్యం... ఆనందరెడ్డి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూద్దామా...?