1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"సూర్య సన్ ఆఫ్ కృష్ణన్" ట్రైలర్ మీ కోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ ఆస్కార్ ఫిలిమ్స్ వి రవిచంద్రన్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్  14వ తేదీ సమీరారెడ్డి
ఆస్కార్ ఫిలిమ్స్ బేనర్‌లో వి. రవిచంద్రన్ నిర్మాతగా తమిళ హీరో సూర్య హీరోగా నటించిన చిత్రం 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్'. తొలిసారి సూర్య తండ్రీకొడులుగా నటించిన ఈ సినిమా వచ్చే నెల 14వ తేదీన విడుదల కానుంది.

సమీరారెడ్డి, సిమ్రాన్‌, దివ్యలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి గౌతం వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులోకి ఎస్.వి.ఆర్ మీడియా పతాకంపై శోభారాణి అనువదించారు.

ఈ చిత్రంలో సూర్య తండ్రీగానూ, కొడుకుగానూ విభిన్న గెటప్‌‌లో కన్పిస్తారు. ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్‌లో 200 థియేటర్లలో ట్రైలర్స్ విడుదలయ్యాయనీ, వీటికి మంచి స్పందన వచ్చిందని శోభారాణి తెలిపారు.

హ్యారీస్ జైరాజ్ రీ రికార్డింగ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని, ఈ చిత్రం సూపర్‌హిట్ అవుతుందని శోభారాణి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టిస్టుకైనా అద్భుతమైన చిత్రాలు చాలా తక్కువగా వస్తాయనీ, అన్ని విధాలా సంతృప్తినిచ్చిన చిత్రమిదని సూర్య చెప్పారు. తండ్రీకొడుకులు, కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత అనురాగాలు ఎలా ఉంటాయో..? ఈ చిత్రం ద్వారా దర్శకుడు గౌతమ్ చక్కగాచూపించారని తెలిపారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...
About Writer
SELVI.M