1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"జేమ్స్ బాండ్ క్వాంటమ్ ఆఫ్ సోలేస్ 2008" ట్రైలర్

వినోదం వెండితెర ట్రైలర్స్ జేమ్స్ బాండ్ క్వాంటమ్ ఆఫ్ సోలేస్ 2008 డానియల్ క్రాగ్ మాథ్యూ అమర్లిక్ జుడి డెంచ్ డేనియల్ ఓల్గా కురివెంకో
జేమ్స్‌బాండ్ సిరీస్‌లో భాగమైన " జేమ్స్ బాండ్ క్వాంటమ్ ఆఫ్ సోలేస్ 2008" అత్యధిక ప్రింట్లతో భారత్‌లో నవంబర్ 7వ తేదీన విడుదల కానుంది. ఇటలీ, పిలి, పనామా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, రష్యా వంటి దేశాలలో షూటింగ్ జరుపుకున్న ఈ హాలీవుడ్ చిత్రం ఇండియాలో ముందుగా విడుదలకావడం విశేషం.

విజయ సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకం ద్వారా ఈ చిత్రం సౌత్ ఇండియా అంతటా 300 ప్రింట్లతో భారీగా విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే 150 ప్రింట్లతో ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. యు.ఎస్‌లో ఈ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది.

ఇది పూర్తి యాక్షన్, ఛేజ్‌లతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ప్రపంచాన్ని అత్యధిక ఉష్ణోగ్రతతో నాశనం చేసి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి దానికి నాయకుడవ్వాలనుకునే విలన్ ఫార్ములాను జేమ్స్‌బాండ్ ఎదుర్కోవడమే ఈ సినిమా ప్రధానాంశం. ప్రేక్షకుడిలో ప్రతి సన్నివేశమూ ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

యాక్షన్ సన్నివేశాలను హీరో డేనియల్ క్రేజ్, హీరోయిన్ ఓల్గా కురివెంకో అద్భుతంగా చేశారు. బాండ్ సిరీస్‌లో వస్తోన్న 28వ చిత్రమైన " జేమ్స్ బాండ్ క్వాంటమ్ ఆఫ్ సోలేస్ 2008" ను అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దర్శకుడు మార్క్ పోస్టర్ అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.

ఇకపోతే... డానియల్ క్రాగ్, మాథ్యూ అమర్లిక్, జుడి డెంచ్ ప్రధాన పాత్రలో కొలంబియా పిక్చర్స్ (సోని), ఎంజీఎం పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలోని ఉత్కంఠభరితమైన సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
SELVI.M