1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

భరత్, జెనీలియా "ప్రేమ" ట్రైలర్ మీ కోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ చెన్నై కాదల్ తెలుగు ప్రేమ విక్రమన్ భరత్ జెనీలియా వెంకట శివ సాయి ఫిలింస్ పతాకం
భరత్, జెనీలియా జంటగా నటించిన తమిళ చిత్రం "చెన్నై కాదల్" తెలుగులోకి "ప్రేమ" పేరుతో తెరకెక్కనుంది. విక్రమన్ దర్శకత్వం‌లో తమిళంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని వెంకట శివ సాయి ఫిలింస్ పతాకంపై ముత్యాల రాందాస్ తెలుగు అందిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... అల్లరి చిల్లరిగా తిరిగే యువకుడికి, స్వతంత్ర భావాలున్న అమ్మాయికి మధ్య ప్రేమ చిగురిస్తుందన్నారు. అప్పుడు వాళ్ళ మధ్య ప్రేమకు అడ్దంకిగా నిలిచిన అంశాలేమిటి? వాటిని ఆ ప్రేమికులు ఎదుర్కొని తమ ప్రేమను ఎలా సఫలం చేసుకున్నారనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని చెప్పారు.

ఈ సినిమాలోని పాత్రలకు భరత్, జెనీలియా చక్కగా అమరారని ముత్యాల రాందాస్ వెల్లడించారు. ఈ చిత్రంలోని కొన్ని మధుర సన్నివేశాలను ట్రైలర్‌లో వీక్షిద్దామా మరి...
About Writer
SELVI.M