గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "నిన్న నేడు రేపు" ట్రైలర్ మీ కోసం...
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
ఎస్.పి.ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవికృష్ణ, అక్షర, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించి తెరకెక్కిన చిత్రం "నిన్న నేడు రేపు". "హైదరాబాద్ నవాబ్స్" ఫేం లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో నూకారపు సూర్యప్రకాశ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఇటవలే విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.

కథాపరంగా చెప్పాలంటే... మనిషికి కోటి ఆశలుంటాయి. అవి ఎప్పటికీ తీరవు. అలాంటి ఆశలతో కలలు గనే ఓ యువకుడి జీవితకథే "నిన్న నేడు రేపు" చిత్రం. ఒక నిరుద్యోగి పట్టణానికి వస్తే ఇక్కడి పరిస్థితులవల్ల ఎలా మార్పు చెందాడనే పాయింట్‌ను... కథను శైలిని రక్తి కట్టించడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు.

నేటి యువత మనస్తత్వాలు, వారిలోని సున్నిత భావోద్వేగాలకు అద్దం పట్టే విధంగా సినిమా ఉంటుందని, దర్శకుని స్టైలీష్ టేకింగ్ అందర్నీ ఆకట్టుకుందని, ఆర్. అనీల్ అందించిన సంగీతం అందర్నీ ఆకట్టుకుందని దర్శకుడు సూర్యప్రకాశ రావు వెల్లడించారు.

కష్టించి పనిచేసి జీవితంలో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో తనకంటే ఎక్కువున్న వారిని చూసి ఈర్ష్య పడకూడదనే సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూద్దామా...?
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర ట్రైలర్స్ ఎస్పిఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం రవికృష్ణ అక్షర తమన్నా నిన్న నేడు రేపు