"నేను మీకు తెలుసా..?" ట్రైలర్ మీ కోసం
మంచు మనోజ్‌కుమార్, స్నేహ ఉల్లాల్ హీరోహీరోయిన్లుగా అజయ్‌శాస్త్రి దర్శకత్వంలో మంచులక్ష్మి నిర్మించి తెరకెక్కిన చిత్రం "నేను మీకు తెలుసా?". థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమాలో మనోజ్ కుమార్ ఛాలెంజింగ్ పాత్రను పోషిస్తున్నాడని చిత్ర సమర్పకుడు మోహన్‌బాబు చెప్పారు.
తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం కోసం మనోజ్ తనకంటే ఎక్కువ శ్రద్ధపెట్టి పనిచేశాడని మోహన్ బాబు అన్నారు. అజయ్ శాస్త్రితో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించామని, చాలా బాగా నచ్చిందని ఆయన అన్నారు.
సంగీత దర్శకుడిగా అచ్చును పరిచయం చేశామని, బడ్జెట్ కూడా అనుకున్న రేంజ్‌లోనే అయిందని, ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ.. సోనీ బి.ఎం.జి ద్వారా మార్కెట్లోకి విడుదలలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని, సోనీ కంపెనీ తొలిసారిగా ఈ చిత్రంతో ముందుకొచ్చిందన్నారు.
తమిళం ఆడియో టాప్-10లో నిలిచిందని, తెలుగులోనూ మంచి ఆదరణ పొందిందని చెప్పారు. ఇప్పటికే ప్లాటినం డిస్క్ దాటిందని, అచ్చు బాణీలు ఆకట్టుకున్నాయని తెలిపారు. మనోజ్ నటన వైవిధ్యంగా ఉంటుందని అన్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షిద్దామా...?