1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"బ్లేడ్ బాబ్జీ"ని ట్రైలర్‌లో తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్ బ్లేడ్ బాబ్జీ దొంగ పోలీస్ నరేష్ సయాలి భగత్ ముత్యాల సత్యకుమార్
దొంగ అవసరార్థం పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తే ఎన్ని వింతలు విడ్డూరాలు ఎదురవుతాయనే పాయింట్‌తో "బ్లేడ్ బాబ్జీ" వినోదాత్మకంగా తెరకెక్కింది. నరేష్, సయాలి భగత్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ముత్యాల సత్యకుమార్ నిర్మించారు. దేవీప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది.

ఈ చిత్రం విజయం పట్ల సినిమా యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఈ చిత్రం గురించి దర్శకుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ... సినిమా ప్రారంభం నుంచి డబ్బింగ్ చెప్పేంత వరకు చిత్ర విజయం సాధిస్తుందని అనే నమ్మకం ఉండేదని అన్నారు. అదేవిధంగా... ప్రేక్షకులు బ్లేడ్ బాబ్జీని హిట్ చేశారని చెప్పారు. థియేటర్లలో అనూహ్య స్పందన లభిస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నటుడు హర్షవర్దన్ మాట్లాడుతూ... "విచిత్ర సోదరులు" తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. కమల్ చేసిన పాత్రను ఎప్పటికైనా చేయకపోతానా అనుకునేవాడినని తెలిపారు.

కానీ ఆ అవకాశం ఇంత త్వరగా "బ్లేడ్ బాబ్జీ" చిత్రం ద్వారా తనకు లభిస్తుందనుకోలేదని హర్షవర్ధన్ చెప్పారు. ఈ సినిమాలో పొట్టిమనిషి తరహాలో నటించే సన్నివేశం తనకు కుదిరిందని వెల్లడించారు. నిజమైన దీపావళి తమకు ఈ చిత్రంతోనే వచ్చిందని అన్నారు.
About Writer
SELVI.M