గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "అష్టాచమ్మా" ట్రైలర్ మీ కోసం...
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
నాని, శ్రీనివాస్, భార్గవి, స్వాతి, తనికెళ్ళభరణి, ఝాన్సీ తదితరులు నటించిన చిత్రం "అష్టాచమ్మా". రామ్మోహన్ నిర్మాతగా ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహన్‌కృష్ణ రూపొందించారు.

ఈ చిత్రంలో కొత్తదనం ఉట్టిపడిందని, కామెడీ కూడా కొత్తరీతిలో ఉందని, బ్రహ్మానందం, అల్లరి నరేష్ వంటివారెవరూ లేకుండా కేవలం కొత్తవారితోనే కావాల్సినంత కామెడీ పండించారని ఈ సినిమాను విడుదల చేసిన శేఖర్ కమ్ముల చెప్పారు.

ఇందులో పాత్రలన్నీ సెల్‌ఫిష్‌గా ఉంటాయని, వారి నటనకూడా సహజత్వంగా ఉందని, కళ్యాణి మాలిక్ సంగీతం బాగుందని, అందుకే ఈ చిత్రాన్ని స్వంత డిస్ట్రిబ్యూషన్ అయిన "టూరింగ్ టాకీస్" ద్వారా ఓవర్ సీస్‌లో విడుదల చేశానని కమ్ముల పేర్కొన్నారు.

సిరివెన్నెల సాహిత్యానికి కళ్యాణిమాలిక్ సంగీతం చాలా బాగా అమరిందని, ఇది పూర్తి రొమాంటిక్ కామెడీ చిత్రమని, మరుగుపడిన అష్టాచమ్మా ఆటను ఈ చిత్రంద్వారా వెలుగులోకి తెస్తున్నందుకు ఆనందంగా ఉందని దర్శకుడు వెల్లడించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర ట్రైలర్స్ నాని శ్రీనివాస్ భార్గవి స్వాతి తనికెళ్ళభరణి అష్టాచమ్మా