1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"కొత్తబంగారులోకం" ట్రైలర్ మీ కోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్ శ్వేత ప్రసాద్ దిల్రాజు శ్రీకాంత్
హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్, శ్వేత ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించి తెరకెక్కిన చిత్రం "కొత్త బంగారు లోకం". దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు.

ప్రతి కుటుంబంలో జరిగే పలు అంశాల్లో ఒక ప్రత్యేక పాయింట్‌ను ఎంచుకుని ప్రధానాంశంగా చిత్రీకరిస్తున్నట్లు దిల్‌రాజు వెల్లడించారు. హీరో తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని, ఆర్య, బొమ్మరిల్లు, ఠాగూర్ లాంటి హిట్ చిత్రాలనందించిన శ్రీకాంత్ మరో హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకోనున్నారని ఆయన అన్నారు.

హ్యాపీడేస్‌లో ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో ఈ కుటుంబ కథా చిత్రాన్ని చూస్తున్నంత సేపు అలాగే ఫీలవుతారని దిల్‌‌రాజు వివరించారు.

"కొత్త బంగారు లోకం" పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాత వెల్లడించారు. అదే విధంగా సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను కొత్త బంగారు లోకం ఆకట్టుకుంటుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.

"హరేరామ్"కు సంగీతం సమకూర్చిన మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్‌ ద్వారా తిలకించండి.
About Writer
SELVI.M