1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"ఏక్‌పోలీస్‌"ను ట్రైలర్లో తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ ఏక్పోలీస్ కోడి రామకృష్ణ నాగబాబు పోలీస్ ఆఫీసర్ అశోక్కుమార్ డాశివప్రసాద్ పృథ్వీ సత్యప్రకాష్
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో నాగబాబు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న తాజా చిత్రం "ఏక్‌పోలీస్". షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సమాజంలోని చెడును అంతమొందించేందుకు కోడి రామకృష్ణ సెల్యులాయిడ్‌పై చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. ఇది అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని నిర్మాత ఎన్.హెచ్.భాస్కర్ రెడ్డి వెల్లడించారు.

అశోక్‌కుమార్, డా.శివప్రసాద్, పృథ్వీ, సత్యప్రకాష్‌ పాత్రలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయని, కేరళ అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నామని నిర్మాత చెప్పారు. సామ్రాట్, ధీరజ్, భూషణ్, సూర్యచరణ్, గాయత్రిల పాత్రలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని ఆయన తెలిపారు. సదానంద్ మెయిన్ విలన్‌గా పరిచయమవుతున్నారని భాస్కర్ వివరించారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. గతంలో ఎన్నో పోలీస్ కథా చిత్రాలు వచ్చినా వాటికి పూర్తి భిన్నమైన, విలక్షణమైన పోలీస్ అధికారిగా నాగబాబు ఈ చిత్రంలో కన్పిస్తారని తెలిపారు. పాత్రకు నాగబాబు పూర్తి న్యాయం చేశారని, సమకాలీన రాజకీయాల చర్చ ఉంటుందని, యువతరానికి చక్కని సందేశముందని దర్శకుడు చెప్పారు.

ఇకపోతే... ఎన్.హెచ్.రుష్యా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి, కోటి సంగీతం సమకూర్చుతున్నారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూసి ఆనందించండి.
About Writer
SELVI.M