1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"ఇంద్రజిత్‌"ను ట్రైలర్లో చూడండి

వినోదం వెండితెర ట్రైలర్స్ ఇంద్రజిత్ సాయికుమార్
సాయికుమార్, సంగీత కథానాయకులుగా నటిస్తున్న"ఇంద్రజిత్" సినిమాలో రమ్యకృష్ణ ప్రిన్సిపాల్ పాత్రను పోషిస్తోంది. గుడ్‌విల్ క్రియేషన్స్ పతాకంపై వీఆర్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, గూనా నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని నిర్మాత తెలిపారు.

సామాజిక స్పృహ, దేశభక్తి, విద్య వంటి అంశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ఆయన అన్నారు. 'ఇంద్రజిత్' అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.

దర్శకుడు నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... మిలిటరీ మేజర్‌గా సాయికుమార్, ఆయన భార్యగా సంగీత, వారి తనయుడిగా ఇంద్ర, తండ్రి పాత్రలో విజయ్ చందర్ నటిస్తున్నారని వెల్లడించారు. కథానుగుణంగా తీవ్రవాద సమస్యను చర్చించడం జరుగుతుందని వెల్లడించారు.

నేటి విద్యా విధానంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల పాత్రలపై కూడా కథానుగుణంగా సన్నివేశాలుంటాయని ఆయన తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి పాటలు... ఇంద్రప్రసాద్, సంగీతం.. కుమార్, మాటలు... వేమగిరి, కెమెరా... అంజి. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...
About Writer
SELVI.M