1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"కొత్త బంగారు లోకం" ట్రైలర్ మీ కోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్ శ్వేత ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం
'హ్యాపీడేస్' ఫేమ్ వరుణ్ సందేశ్, శ్వేత ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "కొత్త బంగారు లోకం". దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహించారు.

ప్రతి కుటుంబంలో జరిగే పలు అంశాల్లో ఒక ప్రత్యేక పాయింట్‌ను ఎంచుకుని ప్రధానాంశంగా చిత్రీకరించినట్టు దిల్‌రాజు వెల్లడించారు. హీరో తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించారు. 'హ్యాపీడేస్‌'లో ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో ఈ కుటుంబ కథా చిత్రాన్ని చూస్తున్నంత సేపు అలాగే ఫీలవుతున్నారని దిల్‌‌రాజు వివరించారు.

"కొత్త బంగారు లోకం" పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాత వెల్లడించారు. అదే విధంగా సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను 'కొత్త బంగారు లోకం' ఆకట్టుకుంటోందని నిర్మాత వివరించారు.

ఈ చిత్రంలోని కొన్ని మధురమైన సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షిద్దామా...?
About Writer
SELVI.M