అల్లరి నరేష్, తాన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "దొంగలబండి". ఈ సినిమాను జి.ఎస్.కె.నెట్‌వర్క్ పతాకంపై జీఎస్‌కే నాయుడు నిర్మిస్తున్నారు. రచయిత వేగ్నేశ్న సతీష్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవలే ఈ సినిమా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది.
ఓ నిధి కోసం సాగే పయనమే "దొంగలబండి" ఇతివృత్తమని నిర్మాత అన్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలంటే.. సీరీయస్‌గానూ, హార్రర్ బేస్ చిత్రాలుగా ఉంటాయని, కానీ తమ చిత్రం పూర్తి హాస్యభరితంగా ఉంటుందని నిర్మాత చెప్పారు. దాదాపు ఇండస్ట్రీలోని కమేడియన్లంతా ఇందులో నటించనున్నారని ఆయన వివరించారు.
చిత్రంలోని ప్రత్యేకతలను గురించి తెలుపుతూ.. నరమాంసభక్షకుల సెటప్, అలీ వేణుమాధవ్‌పై సాగే ఇంట్రడక్షన్ సీన్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందన్నారు.
కామెడీని పూర్తి స్థాయిలో పండిస్తున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూద్దామా...?