"నా అనేవాడు" ట్రైలర్ మీ కోసం...
కష్టంలో కానీ, సుఖంలోకానీ ప్రతిమనిషికి నా అనేవాడు ఒక్కరుంటే చాలనే పాయింట్‌తో "నా అనేవాడు" అనే చిత్రం రూపొందింది. రాజీవ్ కనకాల, హరీష్, తనూజ హీరోహీరోయిన్లుగా సద్గురు సాయి క్రియేషన్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు టి. ప్రశాంత్ మాట్లాడుతూ... సృష్టిలో ఎంతో విలువైనవిగా అభివర్ణించే స్నేహం, ప్రేమ అంశాలను హైలైట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు.
ఇద్దరు కథానాయకుల మధ్య స్నేహం ఎలా మొదలైంది. చివరికి ఆ స్నేహం ఏమైందనే ప్రధానాంశంతో ఈ సినిమాను చిత్రీకరించామని దర్శకుడు తెలిపారు. దేనికీ ఫలితం ఆశించని సున్నితమైన పాత్రలో రాజీవ్ కనకాల చక్కని నటనను కనబరచగా, స్నేహం కోసం ప్రాణమిచ్చే పాత్రలో హరీష్ సైతం పోటాపోటీగా నటించారని దర్శకుడు అన్నారు.
భిన్న మనస్తత్వాలు గల పాత్రలు వీరిచుట్టూ జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, సూర్య ఫోటోగ్రఫీ, తక్కువ డైలాగులతో సాగే రాజీవ్ కనకాల పాత్ర, ఇంటర్వెల్ పార్ట్, సాకేత్ సాయిరాం సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు పేర్కొన్నారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.