"శబరి గిరీశా అయ్యప్ప" ట్రైలర్ మీ కోసం..
గతంలో సోషియో ఫాంటసీ కథాంశంతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. సంఖ్యాపరంగా అప్పటికంటే ఈ తరహా చిత్రాల నిర్మాణం ప్రస్తుతం మరింత ఎక్కువైంది. ఇదే సోషియో ఫాంటసీ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం "శబరి గిరీశా అయ్యప్ప". శ్రీ పద్మనాభ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో పి.వి. రమణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
శివాజీ రాజా, పూజారోషన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం గురించి రమణ మాట్లాడుతూ... అయ్యప్ప మాలధారణ విలువను ఈ చిత్రంలో చూపించబోతున్నామన్నారు. అలాగే అయ్యప్ప 18 మెట్లు ఎక్కడానికి ఎలాంటి అర్హత కావాలనే అంశాన్ని కూడా చర్చిస్తున్నామని వెల్లడించారు. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉన్న చిత్రమిదని రమణ తెలిపారు.
కథానాయకుడు శివాజీ రాజా మాట్లాడుతూ... ఇలాంటి భక్తి చిత్రంలో తాను నటిస్తుండటం ఇదే మొదటిసారని చెప్పారు. ఇందులో దేవుణ్ణి నమ్మని హేతువాది పాత్రను తాను పోషిస్తున్నానని వెల్లడించారు.
ఇంకా ఈ చిత్రంలో... కృష్ణభగవాన్, రంగనాథ్, కె.కె.శర్మ, పృథ్వీ, మాస్టర్ విజయ్, దేవిశ్రీ, కొండవలస, వేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూసి ఆనందించండి.