1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"మిస్టర్ గిరీశా"న్ని ట్రైలర్‌లో వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ కృష్ణభగవాన్ రమ్యకృష్ణ మిస్టర్ గిరీశం కన్యాశుల్కం గురజాడ
కృష్ణభగవాన్, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం "మిస్టర్ గిరీశం". ఆర్.సి. క్రియేషన్స్ పతాకంపై విశ్వప్రసాద్ దర్శకత్వంలో కె. రమేష్ చంద్ర బెనర్జీ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

కథ గురించి విశ్వప్రసాద్ మాట్లాడుతూ... "కన్యాశుల్కం"లోని గిరీశం పాత్రకు కాస్త ఆధునీకతను జోడించి రూపొందించామన్నారు. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించామని ఆయన వెల్లడించారు. అందరూ తమ తమ పాత్రలకు తగినట్లు చక్కగా అమరారని, చిత్ర యూనిట్‌కు ఈ చిత్రం ద్వారా గుర్తింపు లభిస్తుందని విశ్వప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

నిర్మాత మాట్లాడుతూ.. మధురవాణి పాత్రలో రమ్యకృష్ణ నటించడం చిత్రానికి హైలైట్‌గా ఉంటుందన్నారు. మ్యూజిక్ పరంగా మంచి చిత్రమవుతుందని నిర్మాత వెల్లడించారు.

కృష్ణభగవాన్ మాట్లాడుతూ.. గురజాడ కన్యాశుల్కంలోని గిరీశం పాత్రను తాను పోషిస్తున్నానని అన్నారు. ఇందులో తాను హీరో కాదని, కథే హీరో అని తెలిపారు. రమ్యకృష్ణతో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని, దర్శకుడు ఏ మాత్రం రాజీపడకుండా అనుకున్నది అనుకున్నట్లుగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు.

ఈ చిత్రంలోని కొన్ని అద్భుతమైన సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M