"మా అల్లుడు లవంగం" ట్రైలర్ మీ కోసం...
కృష్ణభగవాన్ మామగా, విజయభాస్కర్ అల్లుడిగా నటిస్తున్న చిత్రం "మా అల్లుడు లవంగం". శ్రీరంగం సతీష్ కుమార్ దర్శకత్వంలో.. తలుపులమ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పాలాటి శ్రీనివాసరావు (వాసు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ... పూర్తి వినోదభరితంగా ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారు. మామ, అల్లుడు కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మనసుని చూసి ప్రేమించడం ముఖ్యమనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని నిర్మాత వివరించారు.
పూర్తి హాస్యభరితంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి కృష్ణభగవాన్ క్యారెక్టర్ హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన అన్నారు.
విజయభాస్కర్, రూప, ప్రియ, శాంతి, శ్రీజ, రఘునాథరెడ్డి, కొండవలస, జూ.రేలంగి, అపూర్వ, అల్లరి సుభాషిణి, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న.. ఈ చిత్రంలోని కొన్ని హాస్య సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...