నాని, శ్రీనివాస్, భార్గవి, స్వాతి, తనికెళ్ళభరణి, ఝాన్సీ తదితరులు నటించి తెరకెక్కిన చిత్రం "అష్టాచమ్మా". రామ్మోహన్ నిర్మాతగా ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని "హ్యాపీడేస్" దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. థియేటర్లలో ప్రేక్షకుల మన్ననలు చూరగొంటున్న "అష్టాచమ్మా" సినిమా వందరోజులకు చేరుకుంది.
ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ... దర్శకుడిగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ కొత్తబాటలో పయనించి, సినిమాను అద్భుతంగా తెరకెక్కించారన్నారు. బ్రహ్మానందం, అల్లరి నరేష్ వంటివారెవరూ లేకుండా కేవలం కొత్తవారితోనే కావాల్సినంత కామెడీ పండించారని కమ్ముల చెప్పారు.
ఇందులో పాత్రలన్నీసెల్‌ఫిష్‌గా విభిన్నంగా ఉంటాయని, వారి నటనకూడా సహజత్వంగా ఉందని, కళ్యాణి మాలిక్ సంగీతం బాగుందని కమ్ముల వివరించారు. అందుకే ఈ చిత్రాన్ని సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ "టూరింగ్ టాకీస్" ద్వారా విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు.
ఇకపోతే... కొత్తతరహా కథతో తెరకెక్కిన ఈ సినిమాలో కలర్స్ స్వాతి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అభిమానిగా అలరించింది. ఈ చిత్రానికి సిరివెన్నెల సాహిత్యానికి కళ్యాణిమాలిక్ సంగీతం చక్కగా అమరింది. పూర్తి రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్‌లో తిలకించండి.