1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"మెంటల్ కృష్ణ"ను ట్రైలర్లో వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ పోసాని కృష్ణ మురళి మెంటల్ కృష్ణ సత్య మోహన్ వడ్లపట్ల
పోసాని కృష్ణ మురళి రూపొందిస్తున్న తాజా చిత్రం "మెంటల్ కృష్ణ". "ఆనంద్" చిత్రంలో కమలినీ ముఖర్జీ స్నేహితురాలిగా నటించిన "సత్య" ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతోంది.

మోహన్ వడ్లపట్ల నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ సినిమా గురించి పోసాని మాట్లాడుతూ... ఈ సినిమాలో మూడు షేడ్స్‌లో తన పాత్ర ఉంటుందని, ఇందులో లేడీ గెటప్ కథకు అనుగుణంగా ఉంటుందన్నారు. అందరూ ఆ గెటప్ గురించే చర్చించుకోవడం ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నట్లు పోసాని వెల్లడించారు.

"పెళ్లి చేసుకుందాం", "పవిత్రబంధం" చిత్రాల తరహాలో విభిన్న కథాంశంతో, ఈ సినిమాను స్టడీకామ్ కెమెరాతో చిత్రించామన్నారు. ఇంతవరకు ఎవరూ ఇటువంటి సాహసం చేయలేదని పోసాని అన్నారు.

నాగబాబు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ జాకీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం... వందేమాతరం శ్రీనివాస్, కెమెరా... గాదిరాజు శ్రీనివాస్, ఎడిటింగ్... మోహన్ రామారావు, ఆర్ట్... బాబ్జీ, కథ, స్క్రీన్‌ప్లే మాటలు, దర్శకత్వం... పోసాని కృష్ణ మురళి.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M