1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"జంక్షన్"ను ట్రైలర్‌లో తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ ప్రముఖ రచయిత రవీంద్రనాథ్ హీరో నైనా జంక్షన్ లియో ఎంటర్టైన్మెంట్స్
ప్రముఖ రచయిత రవీంద్రనాథ్ హీరోగా నటిస్తున్న చిత్రం "జంక్షన్". నైనా కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం కె. అనిల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనుంది. లియో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బి. రామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కథ "జంక్షన్" చుట్టూ తిరుగుతుందని నిర్మాత రామకృష్ణ చెప్పారు. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్‌ పెట్టామని, రవీంద్రనాథ్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా పరుచూరి బ్రదర్స్ బలమైన కథను అందించారని నిర్మాత అన్నారు. ఈ సినిమాలోని పాత్రలన్నీ నేచురల్‌గా ఉంటాయని చిత్ర దర్శకుడు వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రంలో కోటశ్రీనివాసరావు, ఆశాషైనీ, డాక్టర్ శివప్రసాద్, ఎమ్మెస్ చౌదరి, భానుచందర్, బ్రహ్మానందం, బాబూ మోహన్, అలీ, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, జయప్రకాష్ రెడ్డి, వేణుమాధవ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు.. పరుచూరి బ్రదర్స్, సంగీతం... జాన్ సాల్మన్, కెమెరా.. వెంకట్, ఆర్.పి., ఎడిటింగ్... నందమూరి హరి.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...
About Writer
SELVI.M