1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"ఫిటింగ్ మాస్టర్" ట్రైలర్ మీ కోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ అల్లరి నరేష్ ఫిట్టింగ్ మాస్టర్ ఆడియో ఆవిష్కరణ ఇవివి డి రామానాయుడు ఉదయ్ కిరణ్
ఇ.వి.వి. సినిమా పతాకంపై "అల్లరి నరేష్" కథానాయకుడిగా "ఫిటింగ్ మాస్టర్". అనే చిత్రం రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిపై చిత్ర దర్శక నిర్మాత ఇవివి మాట్లాడుతూ.. ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించానన్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనా విధానం మారిందని, దానికనుగుణంగా కథను తీర్చిదిద్దానని పేర్కొన్నారు.

దీని కోసం 18 వర్షన్‌లు చూశానని, ఈ చిత్రాన్ని ప్రతి ఇంట్లో జరుగుతున్న ఓ సమస్యను ప్రధానంగా తీసుకుని చిత్రీకరించానని వెల్లడించారు. నరేష్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లు ఈ సినిమాలో ఐదు ఫైట్లున్నాయని ఇ.వి.వి అన్నారు. వనమాలి గేయరచన చేస్తుండగా, 125 చిత్రాలకు రీరికార్డింగ్ చేసిన చిన్నా ఈ చిత్రం ద్వారా వెండితెరకు సంగీత దర్శకుడుగా పరిచయమవుతున్నారని తెలిపారు.
About Writer
SELVI.M