1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"వినాయకుడు" ట్రైలర్ మీ కోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ వినాయకుడు హ్యాపీడేస్ సోనియా శేఖర్కమ్ముల సాయికిరణ్ సరిత పట్రా
"హ్యాపీడేస్" చిత్రంలో నటించిన నటీనటుల్లో చాలామంది ఇటీవల హీరోలు, హీరోయిన్లుగా మారారు. ఆ సినిమాలో నటించిన సోనియా హీరోయిన్‌గా నటించిన చిత్రం "వినాయకుడు". శేఖర్‌కమ్ముల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన సాయికిరణ్ అడవి "వినాయకుడు" చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాగా, సరిత పట్రా ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వగహించారు.

కథలు ఎక్కడి నుంచో పుట్టవు. మన చుట్టూ ఉండే సమాజంలోంచే పుడతాయనేదానికి "వినాయకుడు" నిదర్శనం. మనస్సు నిర్మలంగా ఉండటమే అసలైన అందమని చెప్పే సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇంకా ఈ సినిమాలో కృష్ణుడు, సోనియా, పూనమ్‌కౌర్, సూర్యతేజ్, జ్యోతి, ఆదర్శ్, మురళీకృష్ణ తదితరులు నటించారు.

వినాయకుడిలాగా ఉండే వ్యక్తి నాజుగ్గా ఉండే భామ ప్రేమను కోరుకోవడం తప్పా..? ఒప్పా..? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న "వినాయకుడు" సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M