"కింగ్"ను ట్రైలర్‌లో తిలకించండి
నాగార్జున, త్రిష, మమతామోహన్‌దాస్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "కింగ్". శ్రీనువైట్ల దర్శకత్వంలో కామాక్షి కళామూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ చేసిన "మన్మథుడు", "మాస్" చిత్రాలు ఘనవిజయం సాధించాయని నిర్మాత వెల్లడించారు. అదే తరహాలో నాగార్జున "కింగ్" సినిమా కూడా మంచి హిట్ అవుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.
నాగార్జున "కింగ్" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాత శివప్రసాద్ రెడ్డి అన్నారు. హీరోయిజాన్ని చూపించడంలోనూ, కామెడీ పండించడంలోనూ శ్రీనువైట్లది అందెవేసిన చెయ్యి కావటంతో ఈ చిత్రం ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుందని నిర్మాత అన్నారు.
తనకిష్టమైన హీరో నాగార్జునతో చేసిన "కింగ్" చిత్రం, ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్, యాక్షన్ అంశాలతో తెరకెక్కిందని దర్శకుడు శ్రీనువైట్ల చెప్పారు.
శ్రీహరి, దీపక్, బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణభగవాన్, చంద్రమోహన్, ఎం.ఎస్. నారాయణ, జయప్రకాష్ రెడ్డి, షాయాజీ షిండే తదితరులు నటించిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...