"కొత్తబంగారులోకం" ట్రైలర్ మీ కోసం...
వరుణ్ సందేశ్, శ్వేతబసుప్రసాద్‌లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన చిత్రం "కొత్తబంగారులోకం". ప్రముఖ చిత్ర దర్శకుడు దిల్ రాజు నిర్మించి ప్రేక్షకుల మన్ననలను చూరగొంటున్న ఈ సినిమా ఇటీవలే వందోరోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ... తాను పరిశ్రమకు వచ్చి ఆరు సంవత్సరాల్లో 7 చిత్రాలను నిర్మించానని చెప్పారు. తాను నిర్మాణ సారథ్యం వహించిన అన్నీ చిత్రాలు విజయవంతమయ్యాయని, షూటింగ్‌లో ఉన్న 8,9 చిత్రాలు కూడా అంతే విజయాన్ని సాధిస్తాయని దిల్ రాజు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమా వందరోజుల వేడుకను త్వరలో సెలబ్రేట్ చేయనున్నామని చెప్పారు. ఆ వివరాలను అతి త్వరలో వెల్లడిస్తానని దిల్‌రాజు పేర్కొన్నారు.
"హ్యాపీడేస్" తర్వాత సోలో హీరోగా చేసిన "కొత్తబంగారులోకం" ప్రేక్షకుస ఆదరణ పొందడం తన జీవితంలో మర్చిపోలేని విషయమని వరుణ్ సందేశ్ అన్నారు. ఈ చిత్రం తనకు కొత్త అనుభవాన్ని నేర్పిందని, నటిగా కెరీర్‌ను తీర్చిదిద్దేందుకు ఈ సినిమా చాలా తోడ్పడిందని శ్వేతబసుప్రసాద్ చెప్పారు.
సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ మాట్లాడుతూ.. హ్యాపీడేస్‌లా ఈ చిత్రంలోని పాటలు ప్రజాదరణ పొందాయని, సంగీతదర్శకుడిగా తన స్థాయిని ఈ చిత్రం పెంచిందని తెలిపారు.
థియేటర్లలో మాస్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న "కొత్తబంగారులోకం" చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...