1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"మంజీర"ను ట్రైలర్‌లో వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ మంజీర గౌతమ్ శ్రీదేవీ  మోతుకూరి సాంబశివరావు ఓల్డ్సిటీ హిందూ ముస్లిం
గౌతమ్, శ్రీదేవీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "మంజీర". ఈ చిత్రాన్ని మోతుకూరి సాంబశివరావు నిర్మించారు. ఓల్డ్‌సిటీ నేపథ్యంలో చక్కని ప్రేమకథా చిత్రంగా "మంజీర" రూపుదిద్దుకుంటుందని నిర్మాత తెలియజేశారు.

హిందూ, ముస్లిం మనోభావాలను దెబ్బతీయకుండా తగిన చర్యలు తీసుకుని, అందమైన ప్రేమ కావ్యంగా ఈ చిత్రాన్ని మలచినట్లు ఆయన పేర్కొన్నారు. ముస్లిం యువతిగా శ్రీదేవి నటిస్తుండగా... హిందువుగా గౌతమ్ నటిస్తున్నాడని నిర్మాత వివరించారు. ఎం.ఎం.కె. ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి సాయిభాను దర్శకత్వం వహిస్తున్నారు.

చక్కని సందేశాత్మకంహా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం... దర్శకునితో పాటు చిత్ర యూనిట్‌కు ఈ సినిమా మంచి పేరును సంపాదించి పెడుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.

సలీంపండా, దండపాణి, భాను చందర్, రామరాజు, వేణుమాధవ్, జీవా తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షిద్దామా...?
About Writer
SELVI.M