"శశిరేఖా పరిణయం" ట్రైలర్ మీ కోసం...
తరుణ్, జెనీలియా హీరోహీరోయిన్లుగా, కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం "శశిరేఖా పరిణయం". నిర్మాత సుంకరమధుమురళీ నిర్మించిన ఈ సినిమా... పల్లెటూరి నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రంగా విడుదలై ప్రేక్షకుల మన్ననలను చూరగొంటోంది.
ఈ చిత్రంలో తరుణ్ హీరో అయినా జెనీలియా పాత్రనే ఎక్కువగా హైలెట్ చేయడం ద్వారా టైటిల్‌కు న్యాయం చేశారు. ఇక కథా విషయానికి వస్తే ఓ పల్లెటూరిలో ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన అమ్మాయి శశిరేఖ. రాజమండ్రిలో డిగ్రీ చదువుతున్న శశిరేఖను అవసరంగా ఆమె తండ్రి (ఆహుతి ప్రసాద్) ఊరికి పిలిపిస్తాడు.
శశిరేఖను ఓ ఎన్నారైకి ఇచ్చి ఆహుతిప్రసాద్ పెళ్లి చేయాలనుకుంటాడు. ఓ పెండ్లి కేసెట్‌లో శశిరేఖను చూచిన అభిమన్యు అనే ఎన్నారై ఆమెనే పెండ్లి చేసుకుంటానంటూ ఆహుతీ ప్రసాద్‌కు కబురు చేయడంతో పాటు తన పూర్తి వివరాలతో ఓ డీవీడీని ఆహుతీప్రసాద్‌కు పంపిస్తాడు.
అయితే శశిరేఖకు ఈ పెళ్లిలో ఇష్టం ఉండదు. కానీ తండ్రి బలవంతం మీద చివరకు పెళ్లికి అంగీకరిస్తుంది. అయితే అదేసమయంలో అభిమన్యు తండ్రి తన తండ్రి వద్ద ఇవ్వాల్సిన కట్నాన్ని ముక్కుపిండి మరీ వసూలు చేసిన విషయాన్ని తన మేనమామ ద్వారా తెల్సుకున్న శశిరేఖ ఆ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటుంది.
అంతే పెళ్లి దగ్గరపడే సమయానికి ఒంటిమీద ఉన్న ఏడువారాల నగలతో పాటు ఇంటినుంచి పారిపోతుంది. ఇలా ఇంటి నుంచి పారిపోయిన శశిరేఖ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుంది.. అభిమన్యుడిని పెళ్లి చేసుకుంటా...? అనే అంశాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు.
ఈ సినిమాలోని కొన్ని మధురమైన సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...?