గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "ష్.." (ఇది చాలా మంచి ఊరు) ట్రైలర్ మీ కోసం..
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
అపూర్వ చిత్ర పతాకంపై "ష్.." (ఇది చాలా మంచి ఊరు) చిత్రం రూపొందుతోంది. "కమ్లి" నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన బి.సి. హరిశ్చంద్రప్రసాద్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియా, కెనడా, నార్త్ అమెరికాల్లో యాడ్ ల్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశామని తెలిపారు.

నటుడు షఫీ మాట్లాడుతూ.. "కమ్లి"లో సపోర్టింగ్ పాత్రను పోషిస్తే, ఇందులో హీరోగా చేశానన్నారు. ఈ సినిమాలో డ్రీమ్‌సీన్ నిజజీవితంలో కొనసాగేట్లుగా ఉంటుందని, తర్వాత ఏం జరుగుతుంది? అనేంత ఉత్సుకతను కల్గిస్తుందని షపీ చెప్పారు. ఈ పాత్ర కోసం కొంత ప్రిపరేషన్ కూడా చేశానని, అదొక గొప్ప అనుభూతి అని హీరో తెలిపారు.

కథానాయిక మాధవీలత మాట్లాడుతూ... "నచ్చావులే" చిత్రం ద్వారా తనకు గుర్తింపు లభించిందని, ఈ సినిమాతో అంతకంటే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో రియల్‌లైఫ్‌కు దగ్గరగా తన పాత్ర ఉంటుందని, హీరోయిన్ అవ్వాలనే గ్రామీణ యువతి పాత్రలో నటించానని మాధవీలత వెల్లడించారు.

ఈ సినిమాలోని కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షిద్దామా..?
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర ట్రైలర్స్ ష్ ఇది చాలా మంచి ఊరు ట్రైలర్ అపూర్వ పతాకం బిసి హరిశ్చంద్రప్రసాద్ మాధవీలత కమ్లి షఫీ