1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"మళ్ళీ మళ్ళీ" ట్రైలర్ మీ కోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ మళ్ళీ మళ్ళీ స్కంద కళ్యాణి రొమాన్స్ మర్డర్ మిస్టరీ వేణుమాధవ్ సచిన్ ఖడేకర్ ఎంఎస్నారాయణ కొండవలస
స్కంద, కళ్యాణి హీరోహీరోయిన్లుగా, రాజ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "మళ్ళీ మళ్ళీ". రొమాన్స్, మర్డర్, మిస్టరీ అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కథ గురించి చెబుతూ... ఒక కుర్రాడికి ఒక రోజులో జరిగే సంఘటన ఇతివృత్తంగా ఈ చిత్రం రూపొందుతోందన్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నించే ఓ కుర్రాడు ఆ ఒక్కరోజులో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడనే పాయింట్‌‌తో సినిమా తెరకెక్కనుందని దర్శకుడు తెలిపారు.

ఇంకా ఈ చిత్రంలో వేణుమాధవ్, సచిన్ ఖడేకర్, ఎం.ఎస్.నారాయణ, కొండవలస, అనంత్, శ్రీనివాస రెడ్డి, మేల్కొటి, గీతాసింగ్ తదితరులు నటిస్తున్నారు.

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. రాజ్ ఆదిత్య, సంగీతం... ఎస్.ఎస్. థామస్, కెమెరా... దాశరథి సివేంద్ర, మాటలు.. పి. అజయ్‌కుమార్.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...
About Writer
SELVI.M