"నేను దేవుడ్ని" ట్రైలర్‌ను తిలకించండి
"శివపుత్రుడు", "శేషు" వంటి హిట్ చిత్రాల దర్శకుడు బాల, తాజాగా కాశీలోని అఘోర సన్యాసుల నేపథ్యంలో... తమిళంలో ఓ చిత్రాన్ని రూపొందించారు. దాన్ని తెలుగులో "నేను దేవుడ్ని" అంటూ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్య, పూజ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సందర్భంగా బాలా మాట్లాడుతూ.. ప్రతి మనిషి నేను దేవుడ్ని అనుకుంటారని, ప్రతి మనిషిలోనూ దేవుడుంటాడనేదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తమన్నారు.
హీరో ఆర్య మాట్లాడుతూ... తాను తమిళంలో చేసిన రెండు సినిమాలు తెలుగులోకి అనువదించారని, ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశించారు.
నిర్మాత శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డానని, ఆర్య తన పాత్రకు అనుగుణంగా నటించేందుకు చాలా శ్రమించారని కొనియాడారు. తెలుగులో ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి ఆరో తేదీన తెరపైకి వచ్చేందుకు సిద్ధమౌతోన్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.