"శ్రీశైలం" ట్రైలర్‌ను వీక్షించండి
శ్రీహరి-కె.ఎస్.నాగేశ్వరరావు కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు హ్యాట్రిక్ సాధించిన నేపథ్యంలో.. తాజాగా ఇదే కాంబినేషన్‌లో "శ్రీశైలం" అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. శ్రీహరి, నాగేంద్రబాబు హీరోలుగా కృష్ణంరాజు ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ సినిమాను ఇమేజ్ ఫిలింస్ పతాకంపై రమేష్ నాయుడు నిర్మించారు.
కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సాయి సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సజిత, సుహాని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి నెలాఖరు (31వ తేదీ)న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత రమేష్‌నాయుడు మాట్లాడుతూ.. "ఇప్పటికే ఈ చిత్రం ఆడియో చెప్పుకోదగ్గ రీతిలో విజయం సాధించిందన్నారు. కాశ్మీర్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. 2009లో కనీసం రెండు చిత్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షిద్దామా..?