1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"స్వీట్ హార్ట్" ట్రైలర్ మీ కోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ స్వీట్ హార్ట్ ఆకాష్ వాలెంటైన్డే ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్ నిధి బ్రహ్మానందం
యువహీరో ఆకాష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న "స్వీట్ హార్ట్" చిత్రం వాలెంటైన్‌డేనాడు విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆకాష్ తెలియజేస్తూ... ఈ సినిమా యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ అని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందన్నారు.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి కారణాలు తెలియజేస్తూ.. తాను ఓ కథను తయారు చేసుకుని నిర్మాతల వద్దకు వెళ్లానని, వాళ్లు నచ్చి తననే దర్శకత్వం వహించమని సూచించారన్నారు.

అప్పటికీ వేరే దర్శకుడైతే బాగుంటుందని చెప్పానని, కానీ నిర్మాతలు అంగీకరించకపోవడంతో బలవంతంగా "స్వీట్ హార్ట్" చిత్రానికి దర్శకత్వం వహించాల్సి వచ్చిందని ఆకాష్ వివరించారు.

తమన్నాను హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నామని, అయితే ఆమె బిజీబిజీగా ఉండటంతో ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్ నిధిని కథానాయికగా ఎంపిక చేశామని ఆకాష్ వెల్లడించారు. నిధి పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని, మిగతా హీరోయిన్లుగా డైసీ బోపన్న, సుహాసిని నటించారని ఆకాష్ తెలిపారు.

రాహుల్ దేవ్, బ్రహ్మానందం, చలపతిరావు, సత్యం రాజేష్, బ్రహ్మాజీ, శివారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా.. జాక్, ఎడిటింగ్.. ఎం.ఆర్. వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు... మోహన్, డి. శ్రీదేవి పవార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఆకాష్.

ఈ చిత్రంలోని కొన్ని లవ్లీ సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...
About Writer
SELVI.M