1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"సిద్ధం" ట్రైలర్‌ను వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ జగపతిబాబు సింధుమీనన్ జెడి చక్రవర్తి సిద్ధం హోమం శ్రేయా ప్రొడక్షన్స్ కోనేరు కిరణ్ కుమార్
జగపతిబాబు, సింధుమీనన్ హీరోహీరోయిన్లుగా, జె.డి. చక్రవర్తి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం "సిద్ధం". జగపతిబాబు "హోమం" సినిమా తర్వాత శ్రేయా ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో జగపతిబాబు సూపర్ కాప్ పాత్రను పోషించారు. పేరొందిన పోలీస్ ఆఫీసర్లు దయానాయక్, పి.ఎస్.ఆర్ ఆంజనేయులు జీవితాలలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

చంపడానికైనా.. చవడానికైనా సిద్ధపడే పోలీస్ ఆఫీసర్ కథతో.. ఫిబ్రవరి 12వ తేదీన తెరపైకి రానుంది. పాటలు లేని ఈ సినిమాలో సింధుమీనన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఈ సినిమాలోని కొన్ని అద్భుత సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించి ఆనందించండి.
About Writer
SELVI.M