"ఢీ అంటే ఢీ" ట్రైలర్‌ను తిలకించండి
డైలాగ్ కింగ్ సాయికుమార్ కథానాయకుడిగా సుప్రసిద్ధ నిర్మాత సి.వి.రెడ్డి, సాయిప్రకాష్ దర్శకత్వంలో సి.వి.రెడ్డి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపుదిద్దుకున్న తాజా చిత్రం "ఢీ అంటే ఢీ".
ఈ సినిమా విశేషాలను కథకుడు, నిర్మాత సి.వి. రెడ్డి మాట్లాడుతూ.... బాధ్యత కలిగిన ఒక పోలీస్ అధికారిగా సాయికుమార్ చాలా అద్భుతంగా నటించారని చెప్పారు. మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని కమర్షియల్ హంగులతో తీసిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు.
ఇప్పటికే విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాత తెలిపారు. ప్రజల ప్రయోజనం కోసం దుర్మార్గుల అరాచకాన్ని అణచివేసేందుకు ఢీ కొట్టిన పోలీస్ అధికారి తన లక్ష్యాన్ని ఏవిధంగా నెరవేర్చుతాడనే పాయింట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందని నిర్మాత వెల్లడించారు.
కమర్షియల్ హంగులతో తీసిన ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, జయప్రకాష్ రెడ్డి, అజయ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస, చిట్టిబాబు, గౌతంరాజు, సత్తెన్న, వేణు, వైభవి, ముమైత్ ఖాన్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.