1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"కింగ్"ను ట్రైలర్లో వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ శ్రీనువైట్ల కామాక్షి కళామూవీస్ శివప్రసాద్రెడ్డి నాగార్జున త్రిష మమతామోహన్దాస్ దేవీ శ్రీ ప్రసాద్
శ్రీనువైట్ల దర్శకత్వంలో కామాక్షి కళామూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించిన చిత్రం "కింగ్". ఈ చిత్రంలో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, త్రిష, మమతామోహన్‌దాస్ హీరోహీరోయిన్లుగా నటించారు.

డిసెంబర్ నెలాఖరున విడుదలై ప్రేక్షకుల మన్ననలను చూరగొంటున్న ఈ సినిమా గురించి హీరో నాగార్జున మాట్లాడుతూ... దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేసిన "మన్మథుడు", "మాస్" చిత్రాలు ఘనవిజయం సాధించాయని చెప్పారు. ఇదే తరహాలో "కింగ్" సినిమా కూడా హిటైందని వెల్లడించారు. ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు"కింగ్" రీచ్ అయ్యాడని నాగార్జున తెలిపారు.

తనకిష్టమైన హీరో నాగార్జునతో చేస్తున్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోందని దర్శకుడు శ్రీనువైట్ల వెల్లడించారు. ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్, యాక్షన్ అంశాలతో "కింగ్" తెరకెక్కిందని ఆయన చెప్పారు.

శ్రీహరి, దీపక్, బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణభగవాన్, చంద్రమోహన్, ఎం.ఎస్. నారాయణ, జయప్రకాష్ రెడ్డి, షాయాజీ షిండే, సుప్రీత్, బెనర్జీ, శ్రీనివాస రెడ్డి, చిత్రం శ్రీను, వేణు, ఏవీఎస్, మాస్టర్ భరత్, సంగీత, రజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..
About Writer
SELVI.M