1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"మల్లన్న"ను ట్రైలర్లో వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ మల్లన్న విక్రమ్ తెలుగు తమిళ భాష శ్రేయా కృష్ణ సుశీ గణేశన్ ఎస్ థాను
విక్రమ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలోనే రూపొందుతున్న చిత్రం ‘మల్లన్న’ (తమిళంలో ‘కందసామి’). శ్రేయా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సుశీ గణేశన్ దర్శకత్వంలో ఎస్. థాను నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు కృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

ఈ చిత్రం గురించి నటుడు విక్రమ్ వివరిస్తూ.. హాలివుడ్ తరహాలో మల్లన్న చిత్రం ఉంటుందని తెలిపారు. ఈ చిత్రంలో ఇండియన్ జేమ్స్‌బాండ్‌‌ను తలపించే రీతిలో తన పాత్ర ఉంటుందని ఆయన చెప్పారు. ఈ చిత్రం కోసం తొలిసారిగా బుల్‌ఫైట్‌ను మెక్సికోలో చిత్రించినట్టు విక్రమ్ వెల్లడించారు.

ఇంకా ఈ సినిమాలో తాను ఐదారు పాత్రలు పోషిస్తున్నానని, ముఖ్యంగా తాను పోషించిన లేడీ గెటప్ ప్రేక్షకులందరికీ చాలా బాగా నచ్చిందని విక్రమ్ తెలిపారు.

ఈ చిత్రంలోని కొన్ని అద్భుత సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...
About Writer
SELVI.M