"మంజీర"ను ట్రైలర్‌లో వీక్షించండి
గౌతమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ... మోతుకూరి సాంబశివరావు నిర్మించిన తాజా చిత్రం "మంజీర". శ్రీదేవీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఓల్డ్‌సిటీ నేపథ్యంలో చక్కని ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుందని నిర్మాత తెలియజేశారు.
హిందూ, ముస్లిం మనోభావాలను దెబ్బతీయకుండా తగిన చర్యలు తీసుకుని, అందమైన ప్రేమ కావ్యంగా ఈ చిత్రాన్ని మలచినట్లు నిర్మాత పేర్కొన్నారు. ముస్లిం యువతిగా శ్రీదేవి నటిస్తుండగా... హిందువుగా గౌతమ్ నటిస్తున్నాడని నిర్మాత వివరించారు. ఎం.ఎం.కె. ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి సాయిభాను దర్శకత్వం వహిస్తున్నారు.
చక్కని సందేశాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం, యూనిట్ మొత్తానికి మంచి పేరును సంపాదించి పెడుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.
సలీంపండా, దండపాణి, భాను చందర్, రామరాజు, వేణుమాధవ్, జీవా తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షిద్దామా...?