1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

రామ్, హన్సికల "మస్కా" ట్రైలర్

వినోదం వెండితెర ట్రైలర్స్ రామ్ హన్సిక టాలీవుడ్ బి గోపాల్ ఎంఎస్రాజు మస్కా షీలా సునీల్ కృష్ణభగవాన్
టాలీవుడ్‌లో ఫ్యాక్షన్ కథాంశాలు కనుమరుగవుతున్న తరుణంలో.. బి. గోపాల్ యాక్షన్‌తో, ఎం.ఎస్.రాజు తరహా ప్రేమ కథతో తెరకెక్కిన చిత్రం "మస్కా". సంక్రాంతి పండుగ సందర్భంగా తెరమీదకు వచ్చిన ఈ చిత్రంలో రామ్, హన్సిక, షీలాలు హీరోహీరోయిన్లుగా నటించగా మిగిలిన పాత్రల్లో సునీల్, ముఖేష్‌రుషి, ప్రదీప్ రావత్ ధర్మవరపు సుబ్రమణ్యం, కృష్ణభగవాన్, ఝాన్సీ, నరేష్, తెలంగాణ శకుంతల తదితరులు నటించారు.

ఈ చిత్రం గురించి ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను "మస్కా" ఆకట్టుకుంటోందని చెప్పారు. "రామ్" ఈ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించాడని, "దేశముదురు" ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన హన్సిక కథానాయిక పాత్రకు న్యాయం చేసిందని రాజు అన్నారు.

థియేటర్లలో ప్రేక్షకులను పెద్ద ఎత్తున అలరిస్తున్న ఈ సినిమాకు మాటలు... పరుచూరి బ్రదర్స్, కథ... సూర్య, సంగీతం... చక్రి, పాటలు... కందికొండ, స్క్రీన్‌ప్లే, నిర్మాత...ఎం.ఎస్.రాజు, దర్శకత్వం.. బి.గోపాల్.

"మస్కా" సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
SELVI.M