గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » జగపతిబాబు "సిద్ధం" ట్రైలర్ మీ కోసం...
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
ఐపీఎస్ అధికారులైన పి. సీతారామాంజనేయులు, ముంబై పోలీసు అధికారి దయానాయక్‌ల జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా "సిద్ధం" అనే చిత్రం రూపొందుతోంది. జగపతిబాబు, సింధుమీనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నారు.

"హోమం" చిత్రం తర్వాత జె.డి, జగపతిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 12న "సిద్ధం"ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

చిత్రం గురించి నిర్మాత చెబుతూ... టాస్క్‌ఫోర్స్ విభాగంలో పనిచేసే పోలీసు అధికారిగా జగపతిబాబు ఇందులో కన్పిస్తారన్నారు. సంఘ విద్రోహశక్తుల్ని తుదిముట్టించడంలో ముందుండే వ్యక్తిగా జగపతిబాబు అద్భుతంగా నటించారని కొనియాడారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర ట్రైలర్స్ జగపతిబాబు సిద్ధం ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు దయానాయక్ సింధుమీనన్ జెడి