1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"భారత్ మహాన్.కామ్" ట్రైలర్‌ను వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ జన జాగృతి ఆర్ట్ క్రియేషన్స్ ఆకుల రాఘవ భారత్ మహాన్కామ్
ఆకుల రాఘవ దర్శకత్వంలో, జన జాగృతి ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన తాజా చిత్రం 'భారత్ మహాన్.కామ్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని దర్శకుడు వెల్లడించారు.

ఇంకా చిత్ర దర్శకుడు ఆకుల రాఘవ సినిమా గురించి చెబుతూ.. భారతదేశంలో అరవైఏళ్లు జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెప్పారు. ఈ చిత్రంలో కథ, కథనం ఆలోచింపజేసేలా ఉంటుందని అన్నారు.

ఈ చిత్ర సంగీత దర్శకుడు ఆమోస్ మాట్లాడుతూ... హార్మోనియం స్పెషలిస్ట్‌గా ఉన్న తాను ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించడం పట్ల ఆమోస్ హర్షం వ్యక్తం చేశారు.

జనవరి 30న విడుదలైన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M