"కింగ్"ను ట్రైలర్లో వీక్షించండి
నాగార్జున, త్రిష, మమతామోహన్‌దాస్ హీరోహీరోయిన్లుగా నటించి తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ "కింగ్". శ్రీనువైట్ల దర్శకత్వంలో కామాక్షి కళామూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
డిసెంబరులో విడుదలై థియేటర్లలో "కింగ్" అనిపించుకునే ఈ మూవీలో, నాగార్జున హీరోయిజం భేష్ అని సినిమా విశ్లేషకులు అంటున్నారు. మూడు పాత్రల్లో నాగార్జున అలరించాడని, త్రిష ఆమె పాత్రకు తగిన న్యాయం చేసిందని వారు పేర్కొంటున్నారు.
సాధారణంగా 'కింగ్' అనే పేరు వినగానే ఓ హోదా అనుకుంటామని, కానీ ఈ కింగ్‌కు ఎన్నో బాధ్యతలుంటాయని, వాటిని ఎలా నాగ్ (కింగ్) ఎలా నెరవేర్చాడన్నదే చిత్రకథని సినీ దర్శకుడు శ్రీనువైట్ల అన్నారు.`ఢీ, రెఢీ' వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల తరువాత శ్రీనువైట్ల రూపొందించిన భారీ బడ్జెట్ మూవీ "కింగ్" థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.
ఈ సినిమా గురించి శ్రీనువైట్ల మాట్లాడుతూ ... ఇందులో అభిమానులందరూ ఓ కొత్త నాగ్‌ని చూశారని, ఆయనలో ఓ క్లాస్, ఓ మాస్, హీరోలున్నారని తెలిపారు. రాజఠీవీ నాగ్‌లో ఉట్టిపడుతుందని, కింగ్‌లో ఈ మూడు కోణాల్ని అద్భుతంగా తెరకెక్కించామన్నారు. త్రిష, మమతమోహన్‌దాస్ పాత్రలకూ చాలా ప్రాముఖ్యం ఉందని శ్రీనువైట్ల వెల్లడించారు. తనకిష్టమైన హీరో నాగార్జునతో చేసిన "కింగ్" సూపర్ హిట్టైందని, ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్, యాక్షన్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కిందని ఆయన తెలిపారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.